నవ్వించడానికి ‘క్రేజీ అంకుల్స్’ రెడీ
యాంకర్ శ్రీముఖి, గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం క్రేజీ అంకుల్స్. ఇ.సత్తిబాబు దర్శకత్వం వహించారు. బొడ్డు అశోక్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. నిర్మాతల్లో ఒకరైన శ్రేయాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ కామెడీ జానర్లో తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన క్రేజీ అంకుల్స టైటిల్ సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. రఘు కుంచె స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, శ్రీముఖి తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ : తలశిల కిరణ్ (యూఎస్).













