మరింత వెరైటీగా పుష్ప2 స్పెషల్ సాంగ్
పుష్ప సినిమాలోని పాటలు, డైలాగులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఊ అంటావా సాంగ్. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాంగ్ లో మ్యూజిక్, లిరిక్స్ ఒక ఎత్తయితే సమంత డ్యాన్స్ మరో ఎత్తు. అందుకే ఇప్పుడు పుష్ప2 కోసం దేవీ శ్రీ ప్రసాద్ దానికి మించిన సాంగ్ ను రెడీ చేశాడట. ఈ సాంగ్ కూడా దానిలాగే ట్రెండ్ సెట్ చేయడం ఖాయమంటున్నారు యూనిట్ వర్గాలు.
ఈ సాంగ్ ను ఎవరితో చేయించాలా అని సుకుమార్ ఎంతగానో ఆలోచించాడు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్, దిశా పటానీ తో చేయిద్దామనుకున్నాడు. కానీ ఎందుకో వర్కవుట్ అవలేదు. ఆఖరికి ఆ బంపరాఫర్ ను యానిమల్ సినిమాతో అశేషమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న త్రిప్తి డిమ్రికి ఇచ్చాడు సుకుమార్. అయితే ఈ సాంగ్ గురించి ఇప్పుడో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
ఈ సాంగ్ లో ఐటెంగ్ గర్ల్ తో పాటూ హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక కూడా స్టెప్పులేయనుందట. ఆన్ స్క్రీన్ పై ఇద్దరు భామలతో కలిసి పుష్పరాజ్ ఈ సాంగ్ లో వేసే డ్యాన్సులు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించడం ఖాయమని అంటున్నారు. ఇదే నిజమైతే పుష్ప2లోని స్పెషల్ సాంగ్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయం. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ మే 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.













