OG: ఓజి సెకండ్ సాంగ్ పై క్రేజీ బజ్
పవన్ కళ్యాణ్(pawan kalyan) ఫ్యాన్స్ కు హరి హర వీరమల్లు(harihara veeramallu) సినిమా పూర్తి స్థాయి సంతృప్తిని ఇవ్వలేకపోయింది. రెండేళ్ల తర్వాత పవన్ ను చూశామనే శాటిస్ఫ్యాక్షన్ తప్పించి వీరమల్లు ద్వారా ఫ్యాన్స్ కు ఒరిగిందేమీ లేదు. దీంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ తమ ఆశలన్నింటినీ ఓజి పైనే పెట్టుకున్నారు. సుజిత్(sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజి(OG)పై డే1 నుంచి మంచి అంచనాలున్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టే ఓజి సినిమా తెరకెక్కుతుంది. రీసెంట్ గా ఓజి నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కు కూడా ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా సంవత్సరాలుగా పవన్ ను అతని అభిమానులు ఎలా అయితే చూడాలని ఆశపడ్డారో, ఈ సినిమాలో సుజిత్ అలానే చూపించారని ఫస్ట్ సాంగ్ తోనే క్లారిటీ వచ్చింది. ఈ సాంగ్ లో పవన్ ను స్టైలిష్ గా చూసి ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఓజి సెకండ్ సాంగ్ కు సంబంధించిన ఓ సమాచారం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఓజి నుంచి రాబోయే రెండో పాట లవ్ సాంగ్ అని, ఆ సాంగ్ ను లెజెండరీ సింగర్ చిత్ర(chitra) పాడారని, త్వరలోనే మేకర్స్ ఆ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. తమన్(thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రియాం అరుళ్ మోహన్(Priyanka arul mohan) హీరోయిన్ గా నటిస్తుంది.







