సెన్సిటివ్ టాపిక్ ను టచ్ చేస్తున్న ప్రియదర్శి
నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తూ కొత్త టాలెంట్ ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. నాని బ్యానర్ లో రామ్ జగదీష్(Ram Jagadeesh) అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ప్రియదర్శి(Priya darshi) ప్రధాన పాత్రలో కోర్ట్(COurt) అనే సినిమా రానుంది. రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమాకు స్టేట్ వర్సెస్ నోబడీ(State vs Nobody) అనే ట్యాగ్ లైన్ ను పెట్టారు.
ఈ సినిమాలో ఓ వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. అదే పోక్సో యాక్ట్(POCSO Act). ఇండియాలో లైంగిక నేరాలు, దోపిడీలు, లైంగిక వేధింపుల నుంచి పిల్లలను రక్షించే లక్ష్యంతో చేసిన చట్టమే పోక్సో చట్టం. మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలన్నీ ఈ చట్టం పరిధిలోకే వస్తాయి. ఇప్పుడు కోర్ట్ కథాంశం మొత్తం ఈ చట్టం చుట్టూనే తిరుగుతుందని సమాచారం.
అన్యాయంగా ఓ కేసులో ఇరికించిన ఓ కుర్రాడి కోసం జరిగే న్యాయ పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుందని సమాచారం. ఇందులో ప్రియదర్శి లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేసే అంశాన్ని కూడా ఈ సినిమాలో చూపించనున్నారట. సినిమా క్లైమాక్స్ అందరినీ ఆలోచింపచేసేలా ఉంటుందని, డైరెక్టర్ రామ్ జగదీష్ సున్నితమైన అంశాన్ని ఎంచుకుని దానికి మంచి డ్రామా రాసుకున్నారని, అది నచ్చే నాని సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారని అంటున్నారు.













