Court: తమిళంలో కోర్ట్ రీమేక్?
ఒకప్పుడంటే రీమేక్స్ కు మంచి క్రేజ్ ఉండేది కానీ ఇప్పుడలా కాదు. ఓటీటీలకు క్రేజ్ పెరిగిన తర్వాత భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల హిట్ సినిమాలను ఆడియన్స్ చూసేస్తున్నారు. దీంతో ఏదైనా సినిమాను రీమేక్ చేసినా వాటికి సరైన ఆదరణ లేక ఆ సినిమా పెద్దగా ఆడలేకపోతుంది. ఇలాంటి టైమ్ లో ఓ తమిళ హీరో రీమేక్ పై కన్నేసినట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ హిట్ అంధాధున్(Andhadhun) ను తమిళంలో అంధాగన్(Andhagan) గా రీమేక్ చేసిన కోలీవుడు నటుడు ప్రశాంత్(Prasanth) ఇప్పుడు ఓ తెలుగు సినిమాను రీమేక్ చేయాలని అనుకుంటున్నాడట. కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ(COurt: State vs A No Body) సినిమాను రీమేక్ చేయాలని ప్రశాంత్ ఆలోచిస్తున్నాడట. కృతిక్(Krithik) నిర్మాతగా నటి దేవయాని(Devayani) కూతురు ఇనియా(Iniya) కీలక పాత్రలో ఈ రీమేక్ ను చేయాలని ప్రశాంత్ అనుకుంటున్నాడట.
మరి దర్శకత్వ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది ఇంకా తెలియలేదు. అయితే ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి కొందరు నెటిజన్లు ఈ రీమేక్ అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే కేవలం హిట్ సినిమాల రీమేక్ పైనే కాకుండా ఒరిజినల్ కథలపై కూడా ప్రశాంత్ దృష్టి సారించాలంటున్నారు. మరి ఇవన్నీ విన్న తర్వాత ప్రశాంత్ కోర్ట్ ను రీమేక్ చేస్తాడో లేదో చూడాలి.






