మొదటి దశ వచ్చి సినీ రంగాన్ని గాయాల పాలు చేసి దెబ్బ కొడితే…. రెండవ దశ ఏకంగా చావు దెబ్బ తీసింది! 2022 లో అయినా టాలీవుడ్ నిలదొక్కేనా?
ఇండియన్ ఇండస్ట్రీ లోనే నంబర్‌వన్ గా టాలీవుడ్ దూసుకుపోతోందని వేరే చెప్పనక్కర్లా! ఏ సిని ప్రరిశ్రమ లో లేని విధంగా వందలకు పైగా సినిమాలు తెలుగులో ఒక్క ఏడాదిలోనే నిర్మాణం అవుతాయి. గత అయిదేళ్లుగా టాలీవుడ్ బాలీవుడ్ కే గట్టి పోటీ ఇస్తూ వస్తుంది. బాలీవుడ్ బడ్జెట్ ని సైతం మ్యాచ్ చేస్తూ పాన్ ఇండియా మూవీస్ ని కూడా తీస్తోంది. అటువంటి టాలీవుడ్ కి తట్టుకోలేని ఇబ్బందిగా కరోనా దాపురించింది. 2020, 2021 ఈ రెండేళ్లలో వచ్చిన బంగారం లాంటి రెండు సీజన్లను కరోనా మింగేసింది. దీంతో టాలీవుడ్ కి అపార నష్టమే కలుగుతోంది అంటున్నారు. టాలీవుడ్ కి అద్భుతమైన సీజన్లు ప్రతీ ఏటా ఉన్నాయి. అందులో దసరా, సంక్రాంతి వంటి పెద్ద పండుగులు ఉంటే వాటికి పది రెట్లు పెద్ద సీజన్ గా సమ్మర్ ని చెప్పుకుంటారు.
సమ్మర్ అంటే కచ్చితంగా మూడు నెలలకు పైగా సెలవు రోజులు, జనాలు సినిమాలు చూడడానికి ఎక్కువగా ఇష్టపడేది ఈ సీజన్ లోనే. దాంతో టాలీవుడ్ కి సమ్మర్ అంటే బంగారం తో సమానం. అటువంటి సమ్మర్లు ఒకటి కాదు రెండు కళ్ళ ముందే గిర్రున వెళ్ళిపోతూంటే టాలీవుడ్ ఏం చేయలేని స్థితిలో ఉంది. గతసారి కరోనా మొదటి దశ వచ్చి సినీ రంగాన్ని గాయాల పాలు చేసి దెబ్బ తీస్తే…. రెండవ దశ ఏకంగా చావు దెబ్బ తీసిందనే అంటున్నారు. దాంతో వచ్చే ఏడాది సమ్మర్ వరకూ టాలీవుడ్ కి మంచి రోజులు లేవా అన్న మాట అయితే వినిపిస్తోంది. కరోనా రెండవ దశ ఉధృతి తగ్గినా ఈ ఏడాది చివరి నాటికి కానీ పరిస్థితులు చక్క బడవు. ఇప్పటికే క్రెజీ వున్నా సినిమాల విడుదల తేదీలు వాయిదా వేసుకున్నారు, షూటింగులు రద్దు చేసుకున్నారు. వచ్చే సంక్రాంతికి కూడా అన్ని సినిమాలు వచ్చే సీన్ లేదు.













