ఓటీటీలకు లాభాలు తెస్తున్న కరోనా
అల్లు అరవింద్ ఏదైనా ఒక రంగంలోకి దిగితే ఎంతో ముందుచూపుతో అన్నీ ఆలోచించుకునే ఆ రంగంలో అడుగుపెడుతుంటారని అంటుంటారు. అంతేకాదు ఆయన ఏదైనా బిజినెస్ మొదలుపెడితే అది సక్సెస్ అవకుండా ఉన్న దాఖలాలు లేవని కూడా చెప్తుంటారు. ఆహా అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ ను స్టార్ట్ చేసిన కొన్నాళ్లకే కరోనా పేరుతో ఊహించని ఆపద వచ్చింది. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. థియేటర్లు మూత పడ్డాయి, లాక్ డౌన్ వచ్చి పడింది. అంతే అనుకోకుండా ఓటీటీ రంగం ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.
ఆహా తో పాటుగా మిగిలిన అన్నీ ఓటీటీలకు కరోనా క్రైసిన్ బాగానే కలిసొచ్చింది. అంతే కాదు కరోనా భయం కూడా ఈ ఓటీటీ యాజమాన్యాలకు బాగా కలిసొచ్చింది. ఈ క్రమంలో థియేటర్లకు బాగా నష్టం కలిగింది. కరోనా మొదటి వేవ్ పూర్తై, ఓటీటీల కంటే థియేట్రికల్ ఎక్స్ పీరియెన్సే మేలనుకుని జనాలు మెల్లిగా థియేటర్లకు నడుస్తున్న టైమ్ లో మళ్లీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. అప్పట్లో మొదటి వేవ్ అప్పడు 10 నెలలు థియేటర్లు మూసేయించిన కరోనా, ఇక ఈసారి ఎన్ని నెలల వరకు ఈ పరిస్థితి ఉంచుతుందో చెప్పలేం. అయితే పెరుగుతున్న కేసులను చూస్తుంటే మాత్రం ఈసారి కరోనా ప్రభావం చాలా గట్టిగానే ఉండేట్లుంది.
ఏదేమైనా కరోనా వల్ల దాదాపు ఏడాది పాటు సినిమా హాళ్లు మూత పడ్డాయి. కార్మికులు రోడ్డున పడ్డారు. మళ్లీ ఇప్పుడు సెకండ్ వేవ్ కారణంతో థియేటర్లు మూత పడుతున్నాయి. ఈ వార్త ఓటీటీలకు ప్రాణం పోసినట్లయింది. ఇంతకుముందులానే ఇప్పుడు కూడా నిర్మాతలు ఓపిక నశించి, ఓటీటీ రిలీజ్ లకు తమ సినిమాల్ని కట్టబెడతారనే నమ్మకం ఓటీటీ సంస్థలకు ఎక్కువైపోతుంది. చూస్తుంటే పరిస్థితి కూడా అంతే ఉంది. చూస్తుంటే కరోనా అనేది ఓటీటీ లకు లాభాన్నివ్వడానికే మళ్లీ తన హవా చూపిస్తుందేమో అనిపిస్తుంది.













