Coolie: కూలీ టీజర్ కు ముహూర్తం పెట్టేశారా?
జైలర్(Jailer) మూవీతో మంచి హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) ఇటీవలే ఆ సినిమాకు సీక్వెల్(Jailer2) ను అనౌన్స్ చేశాడు. జైలర్ తర్వాత రజినీ నుంచి వచ్చిన వేట్టయాన్(Vettayan) మూవీ కూడా మంచి హిట్ గానే నిలిచింది. ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నాడు రజినీకాంత్.
దక్షిణాదిలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమాల్లో కూలీ(Coolie) కూడా ఒకటి. అయితే ఈ మూవీని లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ లో కాకుండా స్టాండ్ ఎలోన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక అసలు విషయానికొస్తే, కూలీ మేకర్స్ సినిమాకు సంబంధించిన టీజర్(Coolie Teaser) ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే టీజర్ ను లాక్ చేశారంటున్నారు.
మరో రెండు వారాల్లో టీజర్ రిలీజ్ కానుందని, టీజర్ తో పాటే సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారంటున్నారు. మార్చి 14న లోకేష్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ కూలీ నుంచి టీజర్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఆల్రెడీ లాక్ అయిన టీజర్ పట్ల రజినీతో పాటూ చిత్ర యూనిట్ కూడా చాలా సంతృప్తికరంగా ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున(Nagarjuna)తో పాటూ ఉపేంద్ర(Upendra), శృతి హాసన్(Shruthi Haasan) కూడా కీలక పాత్రల్లో నటిస్తుండగా, పూజా హెగ్డే(Pooja Hegde) కూలీలో స్పెషల్ సాంగ్ చేయనుంది.













