Coolie: కూలీ తెలుగు బ్రేక్ ఈవెన్ ఎంతంటే

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా వస్తోన్న తాజా సినిమా కూలీ(coolie). సౌత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. విక్రమ్(Vikram), లియో(Leo) సినిమాల తర్వాత లోకేష్ నుంచి వస్తున్న మూవీ కావడంతో కూలీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని చూడ్డానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమాను తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తున్నారనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కూలీ సినిమాకు సంబంధించిన తెలుగు హక్కులను ఏషియన్ సునీల్(Asian Suneel) ఏకంగా రూ.52 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు తెలుస్తోంది. కూలీ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ఏషియన్ ఫిల్మ్స్(Asian Films) ప్లాన్ చేస్తోంది.
రూ.52 కోట్లతో కొన్న ఈ సినిమా తెలుగులో లాభాలు చూడాలంటే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే రజినీకాంత్ సినిమాకు అదేమీ పెద్ద మ్యాటర్ కాదు. ఉపేంద్ర(Upendra) కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) విలన్ గా నటించగా శృతి హాసన్(Sruthi Hassan) హీరోయిన్ గా నటించింది. అనిరుధ్(anirudh) సంగీతం అందిస్తున్న కూలీ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde) ఓ స్పెషల్ సాంగ్ చేయగా, ఆగస్ట్ 14న కూలీ ప్రేక్షకుల ముందుకు రానుంది.