Coolie: జైలర్ రూట్ లోనే కూలీ కూడా?
రజినీకాంత్(rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూలీ(Coolie). ఈ సినిమా కోసం మొత్తం దేశమంతా ఎదురుచూస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ కూలీపై అంచాల్ని పెంచుతున్నాయి. ఆగస్ట్ 14న కూలీ రిలీజ్ కానుంది. అంటే రిలీజ్ కు మరో 20 రోజులు మాత్రమే ఉంది. అయినా ఇంకా కూలీ నుంచి టీజర్ కూడా రిలీజవలేదు.
టీజర్ కూడా రిలీజ్ కాకుండా సినిమాకు ఈ రేంజ్ బజ్ తీసుకురావడం ఒక్క లోకేష్ కే చెల్లింది. కాగా ఇప్పుడు కూలీ సినిమా గురించి కోలీవుడ్ వర్గాల్లో ఓ వార్త వినిపిస్తోంది. కూలీ సినిమా కూడా రజినీకాంత్ సూపర్ హిట్ సినిమా జైలర్(Jailer) తరహాలోనే ఉంటుందని, ఒకప్పుడు హార్బర్ ను తన స్వాధీనంలో ఉంచుకుని గోల్డ్ స్మగ్లింగ్ చేసిన ఓ డాన్ కు రిటైరయ్యాక అతని గతం ఎలా వెంటాడుతుందనే లైన్ లో కూలీని లోకేష్ తెరకెక్కించాడట.
ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి తన పాత గ్యాంగ్ పరిచయాలను బయటకు తీసుకురావడం, ఈ క్రమంలో జరిగే పరిణామాలను లోకేష్ అల్టిమేట్ స్క్రీన్ ప్లే తో రాసుకున్నాడని, జైలర్ లో తన వాళ్లను రక్షించడానికి ఎలాగైతే తన గత పరిచయాలను వాడుకుంటాడో ఇప్పుడు కూలీలో కూడా అలానే ఉంటుందని, కాకపోతే ఈ సినిమా జైలర్ తరహాలో ఉండదని అంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే కూలీ సినిమా లోకేష్ తరహా జైలర్ అని అంటున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి.







