డబుల్ ఇస్మార్ట్ సాంగ్‌పై విమర్శలు
సోషల్ మీడియాలో బాగా పాపులరైన మాటల్ని, డైలాగ్స్ ను సినిమా పాటల్లో తీసుకోవడం ఈ మధ్య ఓ ట్రెండైపోయింది. రీసెంట్ గా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ఓ వ్యక్తి నోటి నుంచి పాపులర్ అయిన ఆ కుర్చీని మడతపెట్టి అనే వాయిస్ ముందు పెట్టి ఒక సాంగ్ ను తీసుకొచ్చారు. సినిమా కంటే ఆ సాంగ్ బాగా పాపులరైంది. ఇప్పుడు దాన్ని ఇన్సిపిరేషన్ గా తీసుకున్నారో ఏమో తెలీదు కానీ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కూడా అలాంటి సాంగ్ ను మణిశర్మ కంపోజ్ చేశాడు. కల్లు దుకాణం వద్ద ఉండే ఓ సాంగ్ మధ్యలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో అన్న అయితే ఏం చేద్దామంటవ్ మరి అనే మాటను ముందు పెట్టి ఓ సాంగ్ ను కంపోజ్ చేయించాడు డైరెక్టర్ పూరీ.
కల్లు దుకాణం వద్ద వచ్చే సాంగ్ కు కేసీఆర్ వాయిస్ ను తీసుకోవడం ఆయన్ని తీవ్రంగా అవమానించడమేనని ఆ సాంగ్ ను విమర్శిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. ఓ మాజీ సీఎం వాయిస్ ను తీసుకుంటున్నప్పుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సున్నితమైన అంశాలు అనవసర వివాదాలకు దారి తీసే ఛాన్సుంది. మరి ఈ వివాదాన్ని డబుల్ ఇస్మార్ట్ టీమ్ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.













