దీపావళికి అన్నీ కంటెంట్ ఉన్న సినిమాలే
ఏ పండగొచ్చినా సరే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కళకళలాడుతుంటాయి. అలాంటిది ఈ నెలలోనే దసరా, దీపావళి రావడంతో బాక్సాఫీస్ వద్ద సినిమాలకు ఢోకా లేకుండా పోయింది. దసరా బరిలో వచ్చిన వేట్టయాన్(Vettayan), మా నాన్న సూపర్ హీరో(Maa Nanna Super Hero), జనగ అయితే గనక(Janaka Ayithe Ganaka) సోసోగా అనిపించాయి తప్పించి ఆడియన్స్ ను అలరించలేకపోయాయి.
దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ దీపావళి వైపుకు మళ్లింది. అయితే ఈసారి దీపావళికి రానున్న సినిమాలన్నీ స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్నవాటి లాగే కనిపిస్తుంది. పెద్ద స్టార్ల సినిమాలు రిలీజ్ కావట్లేదనే కానీ ఉన్న సినిమాలన్నీ ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ కలిగించేవే కావడం విశేషం. అందులో ముందుగా దుల్కర్ సల్మాన్(Dulquer Salman) చేస్తున్న లక్కీ భాస్కర్(Lucky Bhaskar).
వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ చాలా కొత్తగా ఇంటెన్స్ గా అనిపించాయి. స్కామ్ 1992(Scam 1992)ను తలపించే సీన్స్ ఈ సినిమాలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఇక కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నుంచి వస్తున్న క(KA) సినిమా టీజర్, ట్రైలర్ కూడా ఆడియన్స్ లో అంచనాలను పెంచింది. డబ్బింగ్ సినిమాలుగా అమరన్(Amaran), భగీర(Bhageera) రానున్నాయి. ఈ రెండు కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలే. మొత్తానికి దీపావళికి అన్నీ కంటెంట్ ఉన్న సినిమాలే వస్తున్నట్లున్నాయి. మరి ఈ వార్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.













