Anil Ravipudi: మరోసారి అనిల్ సినిమాపై కామెంట్స్

ఏ మూవీ సక్సెస్ అవాలన్నా దానికి కంటెంట్ తో పాటూ క్వాలిటీ కూడా ముఖ్యమే. సరైన క్వాలిటీ లేక ఎన్నో సినిమాలు సరైన ఆదరణకు నోచుకోకపోవడం ఇప్పటికే చాలా సందర్భాల్లో చూశాం. మూవీలో కంటెంట్ బావున్నా అది సరైన క్వాలిటీలో లేకపోతే ఆడియన్స్ దాన్ని చూడ్డానికి ముందుకు రారు. చాలా సినిమాలు క్వాలిటీ లేవని ఆడియన్స్ వాటిని తీవ్రంగా విమర్శించిన దాఖలాలున్నాయి.
కానీ అనిల్ రావిపూడి(anil ravipudi) సినిమాలు మాత్రం దీనికి మినహాయింపు. టాలీవుడ్ హిట్ మిషన్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vasthunnam) సినిమాతో ఆల్రెడీ ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)తో మన శంకరవరప్రసాద్ గారు(mana shankaravaraprasad garu) సినిమా చేస్తున్నాడు అనిల్. అయితే ఈ రెండు సినిమాలకీ ఓ పోలిక పెడుతున్నారు నెటిజన్లు.
అదే క్వాలిటీ. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ టైమ్ లో ఆ సినిమా ప్రోమోలు సరైన క్వాలిటీలో లేవని ఎన్నో కామెంట్స్ రాగా, ఇప్పుడు చిరంజీవి సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన మీసాల పిల్ల(meesala Pilla) ప్రోమో విషయంలో కూడా అవే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే క్వాలిటీ సంగతి ఎలా ఉన్నా అనిల్ తన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ను బుట్టలో వేసుకుంటాడు. అలా వేసుకునే సంక్రాంతికి వస్తున్నాంతో భారీ హిట్ అందుకున్నాడు. మరి ఇప్పుడు చిరూ(chiru) సినిమాకు కూడా అదే వర్కవుట్ అవుతుందా లేదా అనేది చూడాలి.