హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. వర్థమాన కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. యూసుఫ్‌గూడలోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక సమస్యలు, వీటికితోడు వైవాహిక జీవితంలో గొడవలు, విజయ్ సాయి ఆత్మహత్యకు కారణమని సన్నిహితులు చెబుతున్నారు. ‘కరెంట్’, ‘వరప్రసాద్ పొట్టి ప్రసాద్’, ‘ఒకరికి ఒకరు’, ‘బొమ్మరిల్లు’ తదితర సినిమాల్లో విజయ్‌సాయి నటించాడు.
భార్యాభర్తలు వనిత, విజయ్ మధ్య గత కొంతకాలంగా వివాదాలు ఉన్నాయి. ఈ నెల 9న వనిత.. తన కారును చెప్పకుండా తీసుకెళ్లినట్లు విజయ్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భార్య వేధింపులకు తోడు గత కొంత కాలం నుంచి సినిమాలు కూడా లేకపోవడంతో విజయ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది.విజయ్ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.













