వేణు బాటలోనే ధనరాజ్ కూడా!
కమెడియన్స్ హీరోలుగా సినిమాలు చేయడం కామనే కానీ డైరెక్టర్లు గా సక్సెస్ అయిన వాళ్లు చాలా తక్కువ. ఒకప్పుడు ఏవీఎస్, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు లాంటి కొందరు కమెడియన్లు మెగా ఫోన్ చేత పట్టి చేయి కాల్చుకున్నారు. ఈ సెంటిమెంట్ ను అధిగమించి వేణు ఎల్దండి బలగం లాంటి సినిమాను తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది రిలీజైన బ్లాక్ బస్టర్ సినిమాల్లో బలగం కూడా ఒకటి అంటే అది ఏ స్థాయి హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు వేణు ను చూసి, తన ఫ్రెండ్ ధనరాజ్ కూడా డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఇప్పటికే గతంలో నిర్మాతగా నష్టపోయిన ధనరాజ్ ఇప్పుడు తండ్రీ కొడుకుల సెంటిమెంట్ స్టోరీతో సముద్రఖని ప్రధాన పాత్రలో ఓ ఎమోషనల్ మూవీని తీయనున్నాడట. ఎమోషన్స్ తో పాటూ కామెడీకి లోటు లేకుండా ఈ కథను ధనరాజ్ రెడీ చేసుకున్నాడని సమాచారం. ఈ మూవీ అక్టోబర్ 22న లాంచ్ చేసి నెలాఖరు నుంచి షూటింగ్ కు తీసుకెళ్లాలనే ప్లాన్ లో ధనరాజ్ ఉన్నాడట.
సినిమాను తక్కువ షెడ్యూల్స్ లో పూర్తి చేసేలా ప్లాన్ కూడా చేసుకున్నాడట. ఈ సినిమాకు నిర్మాత ఎవరు? ఏ ఏ టెక్నీషియన్లు పని చేయనున్నారనేది త్వరలోనే తెలియనున్నాయి. కమెడియన్ గా మంచి ముద్ర వేసుకున్న ధనరాజ్, దర్శకుడిగా ఎలాంటి మార్క్ వేసుకుంటాడో చూడాలి. సినిమాకు మంచి పేరొస్తే ధనరాజ్ కొత్త కెరీర్ను స్టార్ట్ చేయొచ్చు.













