సునీల్ ఈసారి ఎలా మెప్పిస్తాడో?
కమెడియన్ గా టాలీవుడ్ లో ఎంటరై, తర్వాత హీరోగా సక్సెస్ అయ్యాడు సునీల్. ఆ తర్వాత ఆఫర్లు రాకపోవడంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవతరించాడు. రీసెంట్గా పుష్ప సినిమాతో ఏకంగా విలన్ రోల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పుష్ప సినిమా తర్వాత సునీల్‌కు విలన్ గా వరుస ఛాన్సులు వస్తున్నాయి.
ఏకంగా రజీనీకాంత్ జైలర్ మూవీలో విలన్ ఛాన్స్ కొట్టేశాడు సునీల్. దీంతో పాటూ మరో మూడు తమిళ సినిమాల్లో కూడా సునీల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తెలుగులో పుష్ప తర్వాత మళ్లీ ఆ రేంజ్ పాత్రలు సునీల్ చేయలేదు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న మహేష్ 28వ సినిమాలో సునీల్ ఓ కీలకపాత్ర చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది.
ఈ సినిమాలో సునీల్ కోసం త్రివిక్రమ్ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సునీల్ సొంతంగా క్లారిటీ ఇచ్చాడు. సినిమాలో పూర్తి స్థాయి క్యారెక్టర్ కాకపోయినా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని సునీల్ తెలిపాడు.
త్రివిక్రమ్ మూవీలో ఇప్పటికే పలుసార్లు పలు మంచి క్యారెక్టర్లతో అలరించిన సునీల్ ఈ సినిమాతో ఏ మేరకు ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయగలడో చూడాలి. ఇప్పటికే మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాల్లో మంచి ఫన్ క్రియేట్ చేసే పాత్రల్లోనే సునీల్ నటించి మెప్పించాడు. మరి ఈ సినిమలో ఏం చేయబోతున్నాడో చూడాలి.













