కలర్ ఫొటో చిత్రం షూటింగ్ ప్రారంభం
మజిలీ, డియర్ కామ్రెడ్, ప్రతిరోజూ పండగే చిత్రాల్లో కమెడియన్‌గా అందరినీ ఆకట్టుకొన్న సుహాస్ హీరోగా నటించే కలర్ ఫొటో చిత్రం షూటింగ్ మొదలైంది. చాందినీ చౌదరి హీరోయిన్గా నటించే ఈ సినిమాలో సునీల్ ముఖ్య పాత్ర పోషించనున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరిచిన తొలి షాట్‌కు కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేశ్ మహా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దర్శకుడు స్వరూప్ క్లాప్ ఇచ్చారు. యూట్యూబ్‌లో పాపులర్ అయిన సందీప్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. 1995లో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఓ ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రాన్ని సాయి రాజేశ్ నీల, బెన్నీ మప్పానేని నిర్మిస్తున్నారు.













