ప్రముఖ సీనియర్ కో- డైరెక్టర్ సత్యం కన్నుమూత
అక్కడ కోలీవుడ్ లో ఇక్కడ టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ కో- డైరెక్టర్ సత్యం(జె వి వి సత్యనారాయణ) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఎన్నో తెలుగు సినిమాలకు ఆయన కో డైరెక్టర్‌గా సేవలందించారు. టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. కొద్ది సేపటి క్రితం (ఏప్రిల్ 17) ప్రముఖ సీనియర్ కో- డైరెక్టర్ సత్యం అనారోగ్య కారణంతో కన్నుమూశారు. ఇండస్ట్రీలో చాలా కాలంగా కో డైరెక్టర్‌గా పని చేస్తూ ఎన్నో సినిమాల్లో తెరవెనుక భాగం పంచుకున్న సత్యం మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రాజమౌళి, త్రివిక్రమ్‌లతో పాటు కృష్ణ వంశీ లాంటి స్టార్ డైరెక్టర్ల వద్ద కో డైరెక్టర్‌గా సత్యం పనిచేశారు.
మంచితనం, పని పట్ల నిబద్దతతో దర్శకులందరికి ఆప్తుడిగా ఉండేవారు. గుణ శేఖర్ బాల రామాయణం చిత్రానికి, ‘సై’ సినిమాకు చీఫ్ కో డైరెక్టర్‌గా పని చేసిన సత్యం ఆ తర్వాత ”శ్రీరామదాసు, చందమామ” సినిమాలకు కో డైరెక్టర్‌గా సేవలందించారు. అలాగే దర్శకధీరుడు రాజమౌళి సింహాద్రి చిత్రం నుండి రూపొందించిన పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలకు కో డైరెక్టర్‌గా వ్యవహరించారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి కూడా పనిచేసిన సత్యం మరణించారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో విషాదం నింపింది. ఆయన ఇకలేరని తెలిసి ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు పలువురు సినీ ప్రముఖులు. స్వర్గీయ యం యస్ రెడ్డి నిర్మాతగా ‘అందం’ అనే సినిమా కు దర్శకుడిగా చేసారు. కాగా ఆయన కరోనా కారణంగా మరణించారని తెలుస్తోంది. ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స తీసుకుంటూనే ఆయన కన్నుమూశారని సమాచారం.













