ఏపీలో ఆసక్తి రేపుతున్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ
జనసేన నాయకుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలోని కృష్ణలంకలో పవన్ కల్యాణ్ అభిమానులు ఏర్పాటు చేసిన భీమ్లానాయక్ సినిమా ఫ్లెక్సీ ఆసక్తి రేపుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్, వంగవీటి మోహనరంగా, పవన్ కళ్యాణ్ చిత్రలతో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ మధ్యలో కేటీఆర్, తలసాని, వంగవీటి రాధాకృష్ణ, నాదెండ్ల మనోహర్ చిత్రాలు ఉంచారు. కేసీఆర్‌ను ఉద్దేశించి హ్యాట్సాఫ్ సీఎం సార్ అంటూ పోస్టింగ్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ విజయవాడలో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆంక్షలతో ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వానికి కౌంటర్‌గానే ఫ్లెక్సీ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తెలంగాణలో భీమ్లా నాయక్ సినిమా విడుదల నేపథ్యంలో టికెట్ల ధరలు, ఇతర అంశాలపై పని తీరును మెచ్చుకుంటూ పవన్ అభిమానులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. భీమ్లా నాయక్ సినిమాకు తెలంగాణలో బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.













