జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి (74) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనేక సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన మంచి నటుడిగానే కాకుండా, గొప్ప రంగస్థల నటుడిగా కూడా జయప్రకాశ్ రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో బాత్రూమ్లోనే కుప్పకూలిన జయప్రకాశ్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమా షూటింగ్లు లేకపోవడంతో ప్రస్తుతం ఆయన గుంటూరులో నివాసం ఉంటున్నారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.













