మరోసారి బాలయ్య షో కు బాబు
టాక్ షోలలో రారాజుగా నిలిచిన అన్‌స్టాపబుల్(Unstoppable) ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన సీజన్ లాంచ్ ఈవెంట్ లో ఈసారి డబుల్ ఎనర్జీతో షోను నడిపిస్తానని బాలయ్య(NBK) మాటిచ్చాడు. అయితే ఈ సిరీస్‌లో మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)ను తీసుకురానున్నట్లు సమాచారం.
ఇద్దరి మధ్య బంధుత్వంతో పాటూ సీఎం, ఎమ్మెల్యే బాండింగ్ కూడా ఉండటంతో ఈ ఎపిసోడ్‌పై అంచనాలు బాగా ఉన్నాయి. కాకపోతే ఇప్పటికే ఈ షోకు గతంలో బాలయ్య(Balakrishna) వచ్చాడు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏం ఉంటుందనే డౌట్ రావొచ్చు. మొదటిసారి కంటే ఎక్కువ ఆసక్తి కలిగేలా ఈసారి ఈ ఎపిసోడ్‌ను డిజైన్ చేసినట్లు టాక్.
ఎలక్షన్స్ కు ముందు చంద్రబాబు జైలుకి వెళ్లడం, అక్కడి జీవితం, నందమూరి- నారా ఫ్యామిలీలు అనుభవించిన మానసిక క్షోభ, లోకేష్(Nara Lokesh) విక్టరీ, టీడీపీ గెలుపులో జనసేన(Janasena) పాత్ర, పవన్ కళ్యాణ్(pawan Kalyan) చొరవ ఇలా ఎన్నో ఇలా ఎన్నో కొత్త అంశాలు డిస్కషన్ లోకి వస్తాయంటున్నారు. అంతేకాదు ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ కూడా రావొచ్చని లీకొచ్చింది. కానీ 50-50 ఛాన్స్ అంటున్నారు.













