Anil Ravipudi: సీఎంను సైతం నవ్వించిన అనిల్
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించినందుకు గానూ ఆయన చెల్లి బాలయ్య కోసం గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసింది. ఆ పార్టీకి నందమూరి, నారా ఫ్యామిలీలతో పాటూ పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ పార్టీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి(chandrababu naidu)ని అనిల్ రావిపూడి(Anil Ravipudi) తన జోక్స్ తో కడుపుబ్బా నవ్వించాడు.
కార్యక్రమంలో భాగంగా అనిల్ మాట్లాడుతూ ఇవాళ మూడు అద్భుతాలు చూశానని చెప్పాడు. అందులో మొదటిది నారా లోకేష్(Nara Lokesh) భార్య ముందే అమ్మ చేతి వంట బావుంటుందని చెప్పడం. ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప భార్య ముందు నిజాలు చెప్పలేరని అనిల్ అన్నాడు. ఇక రెండోది బాలయ్య(Balayya) బాబుని వసుంధరమ్మ(Vasundhara) ముందు ఐ లవ్ యూ చెప్పమని యాంకర్ అడిగితే బాలయ్య బాబు ఎవరికి చెప్పాలని అడిగారని, భార్య ముందు అంత ధైర్యం ఎవరూ చేయలేరని, ఏం గుండె బాబూ మీది అని బాలయ్యను అన్నాడు.
ఇక మరో విషయంగా భువనమ్మ(Nara Bhuvaneswari) చంద్రబాబు గారిని స్టేజ్ మీదకొచ్చి మాట్లాడమనగానే ఆయన చాలా కామన్ మ్యాన్ లాగా వచ్చి ఆమె పక్కన నిల్చున్నారు. బాబు గారు పైకి రాగానే ఇది పొలిటికల్ మీటింగ్ కాదని 5 నిమిషాలే మాట్లాడాలని టైమ్ లిమిట్ కూడా పెట్టి మాట్లాడమంటే ఆయన సైలెంట్ గా భువనమ్మ మాటల్ని విన్నారని, ఎంత సీఎం అయినా భార్య దగ్గర భర్తేనని అనిల్ అనడంతో చంద్రబాబు అది విని తెగ నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ఆ వీడియోలో చంద్రబాబు ఆనందంగా చూసి ఆయన ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తూ దాన్ని నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.













