Kandula Durgesh: 71 వ జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలకు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు

భగవంత్ కేసరి (Bhagwant Kesari) చిత్రానికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని వెల్లడి. భగవంత్ కేసరి చిత్రబృందం తో వివిధ విభాగాల్లో అవార్డులకు ఎంపికైన తెలుగు చిత్ర బృందాలకు అభినందనలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని తెలిపిన మంత్రి దుర్గేష్. ఈ పురస్కారాలు చిత్ర పరిశ్రమకు మరింత ప్రోత్సాహం అందిస్తాయని పేర్కొన్న మంత్రి దుర్గేష్.