తెలంగాణలో థియేటర్లు మూసివేత
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం సినిమా థియేటర్లపైనా పడింది. వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో ఈ నెల 21 నుంచి 30వ తేది వరకూ సినిమా హాళ్లు మూసివేస్తున్నట్లు తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. ఈ మేరకు కార్యదర్శి విజేందర్ రెడ్డి అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు. వకీల్ సాబ్ సినిమా ప్రదర్శించే థియేటర్లు మినహా మిగితా వాటిని మూసివేయాలని సమావేశంలో నిర్ణయించారు. కరోనా ఉధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం కూడా థియేటర్ల విషయంపై ఓ జీవోని జారీ చేసింది. ఏప్రిల్ 20 నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ. పై ఆర్డర్ ప్రకారం అనుమతులు ఉన్న థియేటర్లు రాత్రి 8 గంటల లోపు మూసివేయాలి. అవి సింగిల్ థియేటర్స్ అయినా, మల్టీఫెక్స్ అయినా.













