ఫాదర్స్ డే నాడు సినీ సెలెబ్రిటీల భావోద్వేగాల ట్వీట్స్
నాన్నంటే తరగని ప్రేమ.. వెలకట్టలేని అభిమానం.. తల్లి జన్మనిస్తే, తండ్రి జీవితాన్నిస్తాడు. స్పూర్తి, ప్రేరణ ఇలా ఎన్నైనా, ఎంతైనా చెప్పుకోవచ్చు. చేతి వేలిపట్టి నడిపించే స్థితి నుంచి చివరకు చితి వరకు నడిపించేంత వరకు ప్రతీ ఒక్కరికి ఎన్నో జాపకాలు, భావోద్వేగాలతో జీవితం కలిబోసి ఉంటుంది. అలాంటి తండ్రిని మరింత ప్రేమతో గుర్తు చేసుకొనే రోజు ఫాదర్స్ డే. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డేను జరుపుకొంటున్న నేపథ్యంలో చిరంజీవి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, నాగ సౌర్య, ఘట్టమనేని మంజుల, లక్ష్మి మంచు తమ భావోద్వేగాన్ని సోషల్ మీడియాలో పంచుకొన్నారు. సినీ ప్రముఖులు తమ తండ్రి గురించి ఏం చెప్పారంటే.. చిరంజీవి :తండ్రి వెంకట్రావును మెగాస్టార్ చిరంజీవి ఫాదర్స్ డే రోజున తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. తన కుమారుడు బాల్యంలో ఉండగా రాంచరణ్‌ను ఎత్తుకొన్ని ఫోటోను చిరంజీవి షేర్ చేశారు. మా చార్మింగ్ డాడీతో చిరుత. మా నాన్న నవ్వు …నా బిడ్డ చిరునవ్వు…రెండు నాకు చాలా ఇష్టం. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. మహేష్ బాబు : తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గురించి చెబుతూ మహేష్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. మానసిక ధృడత్వం, దయ, ప్రేమ, ఉన్నతమైన వ్యక్తిత్వం, ఇతరులపై కురిపించే అభిమానం .. ఇలా ఎన్నైనా నా తండ్రితో ఉన్న బంధం గురించి చెప్పుకొంటూ వెళ్తాను. ఆయన లేకుంటే నేను లేను. నా తండ్రి నాకు నేర్పిన ఎన్నో విషయాలను నా పిల్లలతో పంచుకొంటున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ మహేష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
రాంచరణ్ : ఫాదర్స్ డే రోజున మెగా పవర్ స్టార్ రాంచరణ్ చాలా సింపుల్‌గా స్పందించి గొప్ప ఫీలింగ్‌ను అందించారు. కొన్ని బంధాలను నిర్వహించడానికి మాటలు, ప్రేమను చూపించడానికి చేతలు అవసరం లేదు. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ రాంచరణ్ తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
విజయ్ దేవరకొండ : ఫాదర్స్ డే రోజున తన తండ్రికి శుభాకాంక్షలు చెపుతూ నాన్న నేను ఎప్పుడు మీతోనే ప్రయాణిస్తాను. నా నిర్ణయాలు, తప్పులు, నష్టాలు, సాహసాలు మరియు నేను చేసే యుద్ధాలకు అతను ప్రతిసారీ నాతో ఉంటాడు అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ లో పేర్కొన్నాడు.
నాగ సౌర్య : మిమ్మల్ని సంవత్సరంలో ఒక రోజు చూడకపోయినా నేను తట్టుకోలేను ప్రతిరోజూ అద్భుతంగా ఉన్న మీరు ఎంత ప్రత్యేకమైనవారో నాకు తెలుసు గౌరవించటానికి ఒక రోజు సరిపోదు. మీరు మా కోసం చేసిన త్యాగాలకు ధన్యవాదాలు అంటూ నాగసౌర్య ట్వీట్ చేసారు.
ఘట్టమనేని మంజుల : నిస్వార్థానికి, దయ మరియు ఓదార్యాo తో కూడిన మీ మనసు మీది ప్రపంచంలో నాకు ఇష్టమైన మరియు అత్యంత విలువైన వ్యక్తి. మీరు మాకు నమ్మశక్యం కాని ఉదాహరణ. శ్రద్ధ వహించడం, కరుణించడం మరియు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీరు మాకు నేర్పించారు. హ్యాపీ ఫాదర్స్ డే! అంటూ ఘట్టమనేని మంజుల ట్వీట్ చేసారు.
శృతి హాసన్ : ఫాదర్స్ డేను పురస్కరించుకొని శృతిహాసన్ తన తండ్రికి విషెస్ అందించారు. నా ప్రియమైన తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అందమైన జీవితాన్ని ప్రసాదించినందుకు థ్యాంక్స్. జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడానికి, ధైర్యాన్ని, కళలపట్ల ఆరాధనాభావాన్ని పెంచినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను అని శృతి హాసన్ తన ఇన్‌స్టాలో పేర్కొన్నారు.
లక్ష్మీ మంచు : ఫాదర్స్ డే రోజున తండ్రి త్యాగాలను లక్ష్మీ మంచు గుర్తు చేసుకొన్నారు. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చూసిన నా తండ్రి ఎప్పటికే నా దృష్టిలో గ్రేటెస్ట్. ప్రతీ రోజు పిల్లలపై కురిపించే ప్రేమ చేస్తుంటే నాన్నను మించిన దైవం ఉండదనే ఫీలింగ్ కలుగుతుంది. నాన్న మనస్తైర్యంతోనే ముందుకు వెళ్తున్నానే ఫీలింగ్ కలుగుతుంది అని లక్ష్మీ మంచు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ అయ్యారు.













