ముగిసిన సినీ పెద్దల సమావేశం
గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సినీపెద్దలు అన్ని రంగాల వారితో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియో సెవెన్ ఎక్సర్స్లో జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నిర్మాతల మండలి, నటీనటులు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మా అధ్యక్షుడు శివాజీ రాజా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు గంటల పాటు జరిగిన విస్తృతస్థాయి భేటీలో కాస్టింగ్ కోచ్, టాలీవుడ్ సమస్యలపై చర్చించినట్లు తెలుస్తుంది. సమావేశం తర్వాత సినీ ప్రముఖులు ఎవరు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.













