‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్
‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌లో విక్రమ్ తనయుడు ధ్రువ నటించబోతున్నారు. ఈ చిత్రంతో తన తనయుడు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడని విక్రమ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఓ పెద్ద సర్ప్రైజ్ ఉందని ముందే విక్రమ్ ప్రకటించారు. ఆ సర్ప్రైజ్ ఇదే అన్నమాట. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. రూ.4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ.40 కోట్లు రాబట్టింది. షాలిని పాండే ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాత.













