చిరూ ఫ్యామిలీ ట్రిప్ వెనుక మెగా సక్సెస్ కూడా రీజనేనా?
మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. తన భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి సరదాగా లండన్ లో విహరిస్తున్నారు. దానికి సంబంధించిన ఓ ఫోటోను కూడా చిరూ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోకు నెటిజన్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉంటే చిరూ ఫ్యామిలీ ఈ స్పెషల్ వేయడానికి కారణం పారిస్ బెకాన్స్ లో జరిగే ఒలింపిక్స్ లో పాల్గొనడానికి. ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరిగే ఈ ఈవెంట్ లో చిరూ పాల్గొన్నాడు. అయితే చిరూ ఫ్యామిలీతో వెళ్లడానికి కారణం తన సక్సెస్ అనే చెప్పాలి. ఈ ఏడాది మెగా కుటుంబానికి ప్రతీ రూపంలోనూ సక్సెస్ దక్కుతుంది.
చిరంజీవికి దేశంలోని ప్రముఖ పద్మ విభూషణ్ అవార్డు రావడం, ఆ తర్వాత రామ్ చరణ్ డాక్టరేట్ తీసుకోవడం, రీసెంట్ గా ఏపీ ఎలక్షన్స్ లో చిరూ తమ్ముడు పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడం, ఇలా ప్రతీ ఒక్క విషయంలోనూ మెగా ఫ్యామిలీ సక్సెస్ ను చూస్తోంది. ఈ సక్సెస్ను సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగానే చిరూ ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే చిరంజీవి టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠతో కలిసి విశ్వంభర అనే ఫాంటసీ మూవీ చేస్తుండగా, రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు.













