చిరూతో సందీప్ సినిమానా? జరిగే పనేనా?
భోళా శంకర్ తర్వాత యంగ్ డైరెక్టర్ వశిష్టతో విశ్వంభర చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, అతి త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నాడు. ఇంట్రో సాంగ్, క్లైమాక్స్, కొంత ప్యాచ్ వర్క్ మినహా ఇప్పటికే విశ్వంభర షూటింగ్ ను డైరెక్టర్ పూర్తి చేసేశాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఎవరితో సినిమా చేయనున్నాడనేది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే మెగాస్టార్ తన తర్వాతి సినిమాను సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నాడనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. సందీప్ రెడ్డి, చిరూతో సినిమా చేయడానికి సుముఖంగా ఉన్నప్పటికీ అదెంత వరకు సాధ్యమవుతుందో చూద్దాం. ప్రాక్టికల్ గా చూస్తే వీరిద్దరి కాంబో ఇప్పట్లో కుదరడం కష్టం. దానికి కారణం సందీప్ స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్స్ తో బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం సందీప్ దృష్టి మొత్తం స్పిరిట్ పైనే ఉంది. ఇది కాకుండా అల్లు అర్జున్ కోసం ఓ కథను రెడీ చేయాలి. ఈ రెండూ కాదని చిరూతో సినిమా చేసేంత టైమ్ ఇప్పుడు సందీప్ కు లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇప్పట్లో ఈ కాంబోని ఊహించలేం. మరోవైపు చిరూ తన తర్వాతి సినిమాను మోహన్ రాజా, హరీష్ శంకర్ లో ఒకరితో చేయాలని ఆస్తకి చూపిస్తున్నట్లు టాక్.













