చిరూ నెక్ట్స్ అతనితోనేనా?
భోళా శంకర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్టతో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాతో తనకు మంచి సినిమా ఇచ్చాడనే అభిమానంతో చిరూ మరోసారి మోహన్ రాజాకు ఛాన్స్ ఇచ్చాడంటున్నారు.
గాడ్ ఫాదర్ రిలీజ్ టైమ్ లోనే చిరూ మోహన్ రాజాకు మరో ఛాన్స్ ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. బీవీఎస్ రవి ఇచ్చిన కథను మోహన్ రాజా టీమ్ ప్రస్తుతం డెవలప్ చేస్తున్నట్లు సమాచారం. అయితే చిరూ నెక్ట్స్ మూవీ మోహన్ రాజాతోనే అని చెప్పడానికి కారణం లేకపోలేదు. రీసెంట్ గా పవన్ ఏపీ ఎలక్షన్స్ లో గ్రాండ్ సక్సెస్ సాధించినందుకు పవన్ కు విషెస్ చెప్తూ మోహన్ రాజా ఫోటోలతో ఓ ట్వీట్ చేశాడు. అందులో చిరూ, పవన్ ఇద్దరూ ఉన్నారు. ఆ ట్వీట్ ను బీవీఎస్ రవి రీట్వీట్ చేస్తూ విష్ చేశాడు. ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నందుకే ఇద్దరూ ఇలా రియాక్ట్ అయ్యారని, లేకపోతే మోహన్ రాజా ఓ వైపు తని ఒరువన్2 చేస్తూ అదే పనిగా హైదరాబాద్ వచ్చి మరీ పవన్ ను విష్ చేయడు కదా అని నెటిజన్లు అంటున్నారు. మొత్తానికి చిరూ తర్వాతి సినిమాకు ప్రయత్నాలు మాత్రం గట్టిగానే జరుగుతున్నాయి.













