చిరూ నెక్ట్స్ ఎవరితో?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత చిరూ ఎవరితో సినిమా చేస్తాడనేది ఇంకా క్లారిటీ లేదు. గతేడాది తన పెద్ద కూతురు సుస్మితను నిర్మాతగా మార్చాలని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరూ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ భోళా శంకర్ రిజల్ట్ తర్వాత చిరూ తన నిర్ణయాన్ని మార్చుకుని విశ్వంభరను సెట్స్ పైకి తీసుకెళ్లాడు.
చిరంజీవి దగ్గరకు తరచూ ఎందరో డైరెక్టర్లు కథలు పట్టుకుని తిరుగుతున్నారు. కానీ అవేమీ చిరూకి సంతృప్తినివ్వడం లేదట. ప్రస్తుతం చిరూ పీపుల మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కు ఓ సినిమా బాకీ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తమ బ్యానర్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్న డైరెక్టర్ హరీష్ శంకర్ తో చిరూ కు ఓ కథను చెప్పించారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఓకే కాలేదు.
గాడ్ ఫాదర్ తీసిన మోహన్ రాజా కూడా లైన్ లోనే ఉన్నాడట. కానీ ప్రస్తుతం మోహన్ రాజా జయం రవితో తని ఒరువన్2 లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవడానికి ఎంత లేదన్నా ఏడాది పడుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు చిరూ తర్వాత ఎవరితో చేయబోతున్నాడనేది చెప్పడం కష్టమే. ఒకవేళ కథ నచ్చినా చిరూ తర్వాతి సినిమా మొదలవాలంటే ఆగస్ట్ దాటాల్సిందే. అప్పటివరకు చిరూ విశ్వంభరతో బిజీగా ఉండనున్నాడు.













