మల్టీస్టారర్ కు చిరూ, నాగ్ సై!
చిరంజీవి, నాగార్జున ల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. ఆ బంధంతోనే ఇద్దరూ పార్ట్నర్స్ గా మారి బిజినెస్‌లు చేస్తున్నారు. వీరిద్దరూ ఇంత క్లోజ్ అయినప్పటికీ వీరి కలయికలో ఇప్పటి వరకు మల్టీస్టారర్ సినిమా రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఈ ఇద్దర్నీ ఒకే ఫ్రేమ్ లో బిగ్ స్క్రీన్ పై చూడాలని అటు మెగా ఫ్యాన్స్, ఇటు అక్కినేని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. ఈ కాంబో సాధ్యమేనా అంటే దానికెప్పుడో ఆ ఫ్రెండ్స్ ఓకే చెప్పారు. అప్పట్లో అమీర్ ఖాన్ తో జరిగిన ఇంటర్వ్యూలో చిరంజీవి, తెలుగులో నేను- నాగ్ కలిసి నటిస్తే బాగుంటుందని స్వయంగా చెప్పారు.
చిరూ చెప్పిన ఆ మాట విని నాగ్ కూడా ఎంతో హ్యాపీ గా ఫీలయ్యాడు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి పని చేయడానికి రెడీగా ఉన్నా ఇక్కడ డైరెక్టర్ మాత్రం సెట్ అవట్లేదు. వీరిద్దరినీ కలిపి ఒక ఫ్రేమ్ లో చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఇద్దరి ఇమేజ్‌లకు సరిపోయే కథ దొరకాలి, యూనిక్ క్యారెక్టర్స్ పడాలి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా అయి ఉండాలి. వీటన్నింటినీ ఏ డైరెక్టర్ సెట్ చేసుకుని వీరి కాంబోలో సినిమాను సెట్ చేస్తారో చూడాలి.













