మా ఎన్నికలు వెంటనే జరపాలి : చిరంజీవి
తెలుగు చిత్రసీమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. మా లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్న తరుణంలో క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు చిరంజీవి ఓ లేఖ రాశారు. ఇందులో మా ఎన్నికలు వెంటనే జరపాలని ఆయన సూచించారు. ఎన్నికలు ఆలస్యమైతే అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయన్నారు. ప్రతి రెండేళ్లకు మార్చిలో నిర్వహించాల్సిన ఎన్నికలు ఈ సారి కరోనా కారణంగా వాయిదాపడ్డాయి. ఆపద్ధర్మ కార్యవర్గాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదు. ప్రస్తుత కార్యవర్గానికి నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు ఉండదు కా•ట్టి వీలైనంత త్వరగా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. జాప్యం లేకుండా మా ఎన్నికలు వెంటనే జరగాలి. ఎవరికైనా అభిప్రాయభేదాలు, మనస్పర్థలు ఉంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి తప్పితే బహిరంగంగా విమర్శలు చేయడం మంచిది కాదన్నది నా అభిప్రాయం అని చిరంజీవి లేఖలో పేర్కొన్నారు.













