వెంకీ చిరూ కలయికలో మల్టీస్టారర్..
చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా అంటే అవుననే తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో త్వరలోనే మల్టీస్టారర్ రానున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన వెంకీ75 ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్టు గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో వెంకటేష్ స్పీచ్ లో లాస్ట్ లో చిరంజీవితో త్వరలోనే సినిమా చేస్తానన్నారు.
ఆ తర్వాత చిరంజీవి కూడా తప్పుకుండా సినిమా చేస్తామన్నారు. ఇద్దరం కలిసి సినిమా చేయాలన్న తన కోరికను వెంకటేష్ బయట పెట్టడం తనకెంతో సంతోషాన్నిస్తుందని, తనకు కూడా ఈ కోరిక ఉందని, మంచి స్టోరీ కుదిరితే వెంకీతో సినిమా చేయడం మోస్ట్ హాపీయెస్ట్ మ్యాటర్ అవుతుందని, తమిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బావుంటుందని చిరూ అన్నాడు.
వీరి మాటలతో ఇద్దరు హీరోల అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టార్స్ ఇద్దరికీ కావాల్సిందల్లా మంచి కథ మాత్రమే. ఆ కథతో ఎవరు ముందుకెళ్లి వారిద్దరినీ మెప్పిస్తారన్నది పక్కన పెడితే ఈ కాంబోలో సినిమా వస్తుందన్న ఊహే వారి ఫ్యాన్స్ కు అమితానందాన్నిస్తుంది. అసలే ఇప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టారర్ల హవా నడుస్తుంది. మరి వీరి కాంబోలో మల్టీస్టారర్ ఎప్పుడొస్తుందో చూడాలి.













