మెగాస్టార్ కొత్త చిత్రం ప్రారంభం
చిరంజీవి కథానాయకుడిగా 152వ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. గత ఏడాది దసరాకు పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ విషయాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దేవదాయ శాఖలో అవినీతిని అరికట్టే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుందని సమాచారం. చిరంజీవి దేవదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిస్తారని తెలుస్తోంది. త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది.













