2016 ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చేసిన మెగాస్టార్ మరో రియాలిటీ షోలో కనిపించనున్నారా?
టాలీవుడ్ అగ్ర హీరోల్లో మెగాస్టార్ విషయం లో ఎప్పటికీ ప్రత్యేకమైన శైలి. ఆయన సినిమాలు ఎక్కువగా మాస్ ని ఆకట్టుకునే విధంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఆయనతో సినిమా చేయడానికి ప్రతీ స్టార్ దర్శక నిర్మాతలు ఎదురు చూస్తూ ఉంటారు. ఒకప్పుడు మెగాస్టార్ తో సినిమా అనగానే ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది. అయితే ఆ తర్వాత చిరంజీవి సినిమాలకు కాస్త దూరం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. దాదాపుగా ఆయన నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఓ పక్క సినిమాలు చేస్తూనే ఒక రియాలిటీ షోలో కూడా కనపడే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే స్టార్ మా ఓ భారీ రియాలిటీ షోని మొదలు పెట్టే అవకాశం ఉందని ఆ ప్రోగ్రాం కి మెగాస్టార్ వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. అయితే ఆ షోకి ముందు నాగార్జునను తీసుకోవాలని భావించారు. నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4లో ఇప్పటికే బిజీగా ఉండడం వెనువెంటనె అతనితో చేయడం సరికాదని మెగాస్టార్ చిరంజీవిని అడిగారు అని తెలిసింది. 2016 లో మెగాస్టార్ చిరంజీవి మా టివి కి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకులను ఎంతో అలరించారు, మరి ఈ రియాలిటీ షో ఈ టాస్క్ పై ఉంటుందో వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్ విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ సినిమా తర్వాత చిరంజీవి లూసిఫర్ అనే సినిమాలో నటించనున్నారు. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రెండు సినిమాలకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత అన్ని సినిమాలను కూడా రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర నిర్మాతలు నిర్మించాలని భావించిన సరే రామ్ చరణ్ మాత్రం అవకాశం ఇవ్వటం లేదు. ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తోంది.













