రైతుపాత్రలో మెగాస్టార్ ?
రచయితగా కెరీర్ను ఆరంభించిన స్టార్ డైరెక్టర్గా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వస్తోంది. కాగా మంచి సోషల్ మెజేస్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరురైతు పాత్రలో నటించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర ద్వారా నేటి రైతు పరిస్థితులను సమస్యలకు సరైన పరిష్కారం చూపిస్తారట. కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్లో రూపొందే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్గా తమన్నాను తీసుకోనున్నారని తెలిసింది. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభం కాబోతోందని సమాచారం.













