JVAS: ఆ సినిమాకు చిరూ, శ్రీదేవి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా, శ్రీదేవి(Sridevi) హీరోయిన్ గా నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి(Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా ఎంత పెద్ద హిట్ అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కె. రాఘవేంద్రరావు(K. Raghavendra Rao) దర్శకత్వంలో వచ్చిన ఈ సోషియో ఫాంటసీ సినిమా అందరినీ ఎంతగానో మెప్పించింది. వైజయంతీ మూవీస్(Vyjayanthi Movies) బ్యానర్ పై సి. అశ్వినీదత్(C. Aswanidutt) ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
1990, మే 9న రిలీజైన ఈ సినిమాకు రిలీజైన మొదటి వారం రోజులు వర్షాల కారణంగా పెద్దగా కలెక్షన్లు లేవు. తర్వాత పరిస్థితులు చక్కబడటంతో థియేటర్ల ప్రింట్లు పెరిగాయి. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్సే. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మే 9న దీన్ని రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
రీరిలీజ్ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ఎంత ఖర్చైంది? కలెక్షన్లు ఎంత వచ్చాయి? ఈ మూవీ కోసం చిరంజీవి(Chiranjeevi), శ్రీదేవి(Sridevi) ఎంత తీసుకున్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాను రూ.2 కోట్లతో నిర్మించగా, రూ.15 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి రూ.25 లక్షలు తీసుకోగా, శ్రీదేవి రూ.20 లక్షలు ఛార్జ్ చేసినట్టు అప్పట్లోనే వార్తలొచ్చాయి.






