Chiranjeevi: నాగ్ దారిలో చిరూ

ధనుష్(Dhanush) హీరోగా నాగార్జున(Nagarjuna) కీలక పాత్రలో శేఖర్ కమ్ముల(sekhar kammula) దర్శకత్వంలో వచ్చిన కుబేర(kubera) సినిమా మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. దీంతో చిత్ర యూనిట్ కుబేర విజయోత్సవ సభను ఏర్పాటు చేయగా ఆ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) గెస్టుగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో నాగార్జునను చిరంజీవి పొగడ్తలతో ముంచెత్తాడు. తనను నాగార్జున అన్ని విషయాల్లోనూ ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటాడని చెప్పాడు.
ధనుష్ లీడ్ యాక్టర్ గా కుబేర సినిమాలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ అటెంప్ట్ చేశానని నాగ్ తనకు చెప్పినప్పుడు అలా ఎలా చేశావని అడిగానని, దానికి నాగ్ తనకు కొత్తగా చేయాలనిపిస్తోందని చెప్పాడని చిరూ చెప్పాడు. కుబేర సినిమా చేశాక నాగ్ డెసిషన్ కరెక్ట్ అనిపించిందని, కుబేర లో దీపక పాత్ర చేశాక మరో 40 ఏళ్ల పాటూ తాను ఇండస్ట్రీలో ఉంటాననే నాగ్ మాటలు నిజమనిపించాయని చిరంజీవి అన్నాడు.
దీపక్ లాంటి క్యారెక్టర్ ను చేయడం ఎంతో కష్టమని, కానీ నాగ్ ఆ క్యారెక్టర్ ను చాలా అలవోకగా చేశాడని చిరూ చెప్పాడు. క్రమశిక్షణ, తన ఆలోచనా విధానం, ఆరోగ్యం, స్థితప్రజ్ఞత లాంటి ఎన్నో విషయాల్లో నాగ్ తననెప్పుడూ ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటాడని, నాగ్ దారిలో తాను కూడా పోటీగా వస్తానని చిరూ సరదాగా అన్నాడు. నాగ్ ను చూసి తాను కూడా భవిష్యత్తులో కొత్త పాత్రలను సెలెక్ట్ చేసుకుంటానని చిరూ ఈ సందర్భంగా చెప్పాడు.
https://x.com/Tolly_BOXOFFICE/status/1936824082332356647