ఒకేసారి రెండు?
చిరంజీవి ఒకేసారి రెండు సినిమాలు చేయనున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పూర్తిగా తన దృష్టిని సినిమాలపై కేంద్రీకరించారు. గత ఏడాది సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో సైరా చిత్రాన్ని మొదలుపెట్టారు చిరు. ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించాలని, జాతీయ స్థాయి సినిమాగా తీర్చిదిద్దాలని టీమ్ భావిస్తుండటంలో ఈ చిత్రం పూర్తి కావడానికి చాలా సమయం పట్టనుంది. మరోవైపు కొరటాల శివ ప్రాజెక్ట్‌ను కూడా చిరు ఒప్పుకున్నారని తెలిసింది. ఇంకొన్ని నెలల్లో దాన్ని మొదలుపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి చిరంజీవి ఒకేసారి రెండు సినిమాలు చేయక తప్పేలా లేదనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల మేరకు నిజంగానే చిరంజీవి, కొరటాల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా, ఇస్తే రెండు ఒకేసారి చేస్తారా లేదా అనేది చూడాలి. ఈ మేరకు మెగా కాంపౌండ్ నుండి అధికారిక ప్రకటన వెలువడితేనే అన్ని విషయాలు తెలుస్తాయి.













