మెగా ఫ్యామిలీకీ క్రిస్మస్ కానుక
క్రిస్మస్ రోజున ప్రముఖ కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట సంతోషం వెల్లివిరిసింది. చిరు కుమార్తె శ్రీజ రెండో బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని శ్రీజ భర్త, కథానాయకుడు కల్యాణ్‌దేవ్ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. ఈ క్రిస్మస్ నా జీవితాంతం గుర్తుండిపోతుంది. మాకు ఈ ఉదయం పాపాయి జన్మించింది. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కల్యాణ్‌దేవ్, శ్రీజ వివాహం 2016లో జరిగింది. విజేతతో కల్యాణ్‌దేవ్ ఈ ఏడాదే తెరకు పరిచయమయ్యారు. ప్రస్తుతం ఆయన రెండో చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు.













