Mega157: అనీల్ సినిమాలో చిరూ పాత్ర అదేనా?

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి వశిష్ట(Vassishta) దర్శకత్వంలో రానున్న విశ్వంభర(Viswambhara) అనే సోషియో ఫాంటసీ డ్రామా కాగా రెండోది టాలీవుడ్ హిట్ మిషన్ అనీల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా157. ప్రస్తుతం అనీల్ తో కలిసి మెగా157(Mega157)ను పరుగులు పెట్టిస్తున్నారు చిరంజీవి(Chiranjeevi).
నయనతార(Nayanthara) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఏ చిన్న లీక్ వచ్చినా అది క్షణాల్లో నెట్టింట వైరల్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మెగా157లో చిరంజీవి పాత్రకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. మెగా157లో చిరంజీవి డ్రిల్ మాస్టర్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్రలో చిరూ కామెడీ టైమింగ్, తన యాక్టింగ్ హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.
అయితే చిరూ పాత్ర గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వచ్చింది లేదు. కాబట్టి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. భీమ్స్ సిసిరోలియో(Bheems Ciciroleo) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్(Shine Screens Banner) లో సాహు గారపాటి(Sahu Garapati), సుస్మిత కొణిదెల(Sushmitha Konidela) నిర్మిస్తుండగా, వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా మెగా157 ప్రేక్షకుల ముందుకు రానుంది.