ఒకేసారి సెట్స్ పైకి వెళ్లనున్న చిరూ, రవితేజ
చిరంజీవి, రవితేజ ఇద్దరూ తమ తర్వాతి సినిమాలను ఒకేసారి స్టార్ట్ చేయబోతున్నారట. చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్లో 156వ సినిమాలో ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించలేదు. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మొదటి షెడ్యూల్‌నే యాక్షన్‌తో స్టార్ట్ చేశారట. సినిమా కోసం చిరంజీవి స్పెషల్ గా రెడీ అవుతున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్నఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీపై అంచనాలు కూడా భారీ అంచనాలున్నాయి. నలుగురు హీరోయిన్లు నటించనున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా అనుష్క పేరు మెయిన్ లీడ్ గా వినిపిస్తుంది.
ఇక ఇదే నెలాఖరులో మాస్ రాజా రవితేజ-గోపీచంద్ మలినేని కాంబోలో స్టార్ట్ అయిన సినిమా కూడా రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా యాక్షన్ షెడ్యూల్‌తోనే మొదలుపెట్టనున్నట్లు సమాచారం. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి. ఒకే నెలలో చిరూ, రవితేజ సినిమాల షూటింగ్ మొదలవడం, అది కూడా రెండు సినిమాలూ యాక్షన్ ఎపిసోడ్‌తోనే స్టార్ట్ అవడం ఇదే మొదటిసారి.













