‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను స్వీకరించిన మొక్కలు నాటిన మెగా బ్రదర్స్ చిరంజీవి , పవన్ కళ్యాణ్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఈ రోజు జూబిలీ హిల్స్, ఫిలిం నగర్ లో జరిగిన గ్రీన్ ఇండియా కార్యక్రమం లో మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు శర్వానంద్ మరికొంతమంది సినీ ప్రముఖులు మొక్కలు నాటారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని, పెరిగిపోతున్న కాలుష్యానికి బ్రేక్ వేయడానికి ఇది ఒక వెపన్ లా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. “మన విశ్వానికి వృక్షాలు ప్రాణం లాంటివి. మొక్కలు నాటండి గ్రీన్ ని పెంపొందించండి త్థద్వారా బావి తరాలకు మనమిచ్చే సంపద ఈ ఆకుపచ్చదనం. వృక్షాలు మనం వదిలిన కాలుష్యాన్ని పీల్చుకుని మన ప్రాణానికి అవసరమైనటువంటి ఆక్సీజెన్ అందించే వృక్షాలు మనకు దేవుడిచ్చిన వరం. జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమంగా 2 ఏళ్ళ క్రితం ప్రారంభించారు. ఆయన చేస్తున్న ఈ యజ్ఞం లో నేను పాలు పంచుకున్నాను. నరేంద్ర చౌదరి గారు నన్ను ఆహ్వానించారు ఇదిగో నేను మొక్కలు నాటను. అంతేకాదు నా అభిమానులందరి ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను ముందుకు తీసుకుపోయేలా.. ప్రతి ఒక్క అభిమాని మొక్కలు నాటాలని కోరుతున్నాను.” ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ … “రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గత 2 సంవత్సరాలనుండి లక్ష మొక్కలు నాటాలని ఈ కార్యక్రమాన్ని పట్టుదలతో నిర్వహిస్తున్నారు. లక్ష కాదు కోటి మొక్కలు నాటడానికి అయన దోహద పడ్డారు. ఈ రోజు జూబిలీ హిల్స్ ఎంత పచ్చగా ఉండడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడింది” అన్నారు . ఇంకా దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు శర్వానంద్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి మాట్లాడారు.













