Sandeep Reddy Vanga: స్పిరిట్ లో చిరంజీవి లేరు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా స్పిరిట్(spirit). రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఓ ఆడియో టీజర్ ను రిలీజ్ చేసి దాంతో టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా స్పిరిట్ పై మంచి హైప్ ను క్రియేట్ చేశాడు సందీప్, ఇంకా సినిమా సెట్స్ కు వెళ్లకుండానే స్పిరిట్ పై మంచి అంచనాలను నెలకొల్పాడు.
అయితే గత కొన్నాళ్లుగా స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్నాడని, స్పిరిట్ లో ప్రభాస్ కు తండ్రి పాత్రలో చిరూ కనిపించనున్నారని వార్తలు రాగా, రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సందీప్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. స్పిరిట్ లో ప్రభాస్ తండ్రి పాత్రలో చిరంజీవి నటిస్తాడని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, ఈ సినిమాలో చిరంజీవి ఎలాంటి పాత్రలోనూ కనిపించడం లేదని, ఆ వార్తలన్నీ పుకార్లేనని చెప్పాడు.
మరి కొరియన్ యాక్టర్ డాన్ లీ(Don Lee) విలన్ రోల్ చేస్తున్న విషయం నిజమేనా అని అడిగితే దానికి మాత్రం సందీప్ అవునని కానీ కాదని కానీ సమాధానమివ్వలేదు. డాన్ లీ విషయంలో సందీప్ మౌనం అంగీకారమేనని భావిస్తూ స్పిరిట్ లో ఆయన నటిస్తున్నాడని కన్ఫర్మ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ నెలలో పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టి, నెక్ట్స్ ఇయర్ ఫిబ్రవరి నుంచి స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.







