సంక్రాంతి బరిలో చిరంజీవి
ఇంకా ఆరు నెలలు టైమ్ ఉండగానే 2024 సంక్రాంతికి సినిమాల రిలీజ్ లు షెడ్యూల్ అయిపోయాయి. దీంతో సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ప్రాజెక్ట్ కె సంక్రాంతి బరి నుంచి దాదాపు తప్పుకున్నట్లు ఖాయమైంది. దీంతో పాటూ షెడ్యూల్ అయిన మహేష్ బాబు త్రివిక్రమ్ ల సినిమా గుంటూరు కారం కూడా జనవరి 13కి రిలీజ్ కానుంది.
ఈ సినిమా షూటింగ్ లో కొంత లేట్ జరుగుతున్నప్పటికీ ఎలా అయినా సరే ఈ సినిమాను అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా రవితేజ నటిస్తున్న ఈగల్ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రాజెక్ట్ కె ఎలాగూ రేసు నుంచి తప్పుకుంది కాబట్టి గుంటూరు కారం, ఈగల్ మాత్రమే సంక్రాంతి బరిలో ఉన్నాయి.
ఈ రెండు సినిమాలతో పాటుగా సంక్రాంతికి ఇంకో పెద్ద సినిమాను కూడా రిలీజ్ చేసే ఛాన్సుందని భావిస్తున్నారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఈ సంక్రాంతి రేసు లో ఉంటాడని ప్రచారం జరిగింది. ఆయన గత రెండు మూడు నెలలుగా ఉస్తాద్ భగత్‌సింగ్, ఓజీ సినిమల షూటింగ్ లో పాల్గొంటూ వచ్చాడు. వీటిలో ఏదొకటి సంక్రాంతికి రిలీజ్ అవుతుందనుకున్నారు కానీ పవన్ ఇప్పుడు ఎలక్షన్స్ ప్రచారంలో బిజీ అయ్యాడు కాబట్టి అది వర్కవుట్ అయ్యేలా లేదు.
ఇప్పుడు పవన్ ప్లేస్ లోకి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బరిలో నిలిచేట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం భోళా శంకర్ చేస్తున్న చిరూ, ఆ తర్వాతి సినిమాను బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయనున్నాడు. ఆ సినిమాను త్వరగా పూర్తి చేసి 2024 సంక్రాంతికి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ రానుంది.













