మెగాస్టార్‌ను సత్కరించిన ఫిలిం క్రిటిక్స్
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం విజయవంతమైన సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్‌సిఎ) కార్యవర్గ సభ్యులు ఆయన నివాసంలో కలిసి అభినందించారు. మెగాస్టార్ చిరంజీవిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందని..గోల్డెన్ జూబ్లీ వేడుకను వైభవంగా నిర్వహించబోతున్నామన్నామని మెగాస్టార్‌కు తెలియజేశారు. ఈ వేడుకకు చిరంజీవిని ఆహ్వానించగా..ఆయన తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. మెగాస్టార్‌ను కలిసిన వారిలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొండేటి సురేష్, కార్యదర్శి ఇ.జనార్దన్ రెడ్డి, గోల్డెన్‌జూబ్లీ వేడుక చైర్మన్ బి.ఎ.రాజు, సీనియర్ జర్నలిస్టు ప్రభు, అసోసియేషన్
ఉపాధ్యక్షులు డి.జి.భవాని, సజ్జావాసు, కోశాధికారి ఎం.నాగభూషణ్, పర్వతనేని రాంబాబు, మడూరి మధు, కార్యవర్గ సభ్యులు సాయిరమేష్, ముత్యాల సత్యనారాయణ, మురళి (శక్తిమాన్), చిన్నమూల రమేష్, జిల్లా సురేష్ తదితరులు ఉన్నారు.













