సీఎం ఆహ్వానం మేరకు సినీ పరిశ్రమ బిడ్డగా వచ్చాను… అనవసరపు వ్యాఖ్యలు చేయొద్దు భేటీ చాలా సంతృప్తికరంగా సాగింది : చిరంజీవి
ఆంధ్రప్రదేశ్లోని సినిమా టికెట్ రేట్స్ విషయం గురించి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డితో చర్చించడానికి సినీ ఇండస్ట్రీ తరపు నుంచి మెగాస్టార్ చిరంజీవి అమరావతి చేరుకున్నారు. బేగం పేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరిన చిరంజీవి, గన్నవరం చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని సినిమా టికెట్ రేట్స్ విషయం గురించి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డితో చర్చించడానికి సినీ ఇండస్ట్రీ తరపు నుంచి మెగాస్టార్ చిరంజీవి అమరావతి చేరుకున్నారు. బేగం పేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరిన చిరంజీవి, గన్నవరం చేరుకున్నారు. అక్కడ మీడియా ప్రతినిధులు చిరంజీవిని అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
‘‘సినీ పరిశ్రమకు చెందిన బిడ్డగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్తో చర్చిండానికి ఇక్కడికి వచ్చాను. చిత్ర పరిశ్రమకు చెందిన విషయాల గురించి ఆయనతో మాట్లాడుతాను. భేటీ పూర్తయిన తర్వాత అన్ని విషయాలు తెలియజేస్తాను’’ అన్నారు.
గన్నవరం నుంచి తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకి చిరంజీవి బయలుదేరారు. ప్రత్యేకమైన జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ రేట్స్ తగ్గించడంపై చాలా రోజులుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సదరు కమిటీఇటీవలే జగన్ను కలిసింది. పేర్ని నానితో ఇటీవల ఇదే టికెట్ సమస్యపై మాట్లాడటానికి రామ్ గోపాల్ వర్మ మంత్రి పేర్ని నాని సహా కొంత మంది అధికారులు కలిసి చర్చింంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవిని వై.ఎస్.జగన్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో ఈ భేటికి చాలా ప్రాధాన్యత నెలకొంది. ఈ భేటి గురించి అక్కినేని నాగార్జున కూడా మాట్లాడారు. సీఎం జగన్తో భేటి కానున్నట్లు చిరంజీవి తనకు ఫోన్ చేసి చెప్పారని, తనను కూడా అడిగారని, అయితే తనకు బంగార్రాజు సినిమా విడుదల ఉండటం.. దానికి సంబంధించిన ప్రమోషన్స్తో బిజీగా ఉండటంతో కుదరదని చెప్పినట్లు నాగ్ అన్నారు. జగన్తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలున్నాయని, అంతా మంచే జరుగుతుందని నాగ్ ఈ సందర్భంగా తెలిపారు.
సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు, సినీ నిర్మాతలు వెళ్లి సినిమాటోగ్రఫీ మినిష్టర్ పేర్ని నాని సహా అధికారులను కలిశారు. చిరంజీవితో జగన్ బేటి కావడం అనే ప్రక్రియ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండింది. ఎట్టకేలకు సినిమా టికెట్ ఇష్యూపై చిరంజీవి జగన్ను కలుస్తున్నారు. జగన్తో కలిసి చిరంజీవి లంచ్ చేస్తారు. దాదాపు గంటన్నర పాటు జగన్, చిరంజీవి ప్రత్యేకంగా భేటికి కాబోతున్నారు. మరి ఈ మీటింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
భేటీ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాటల్లోనే: “ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో భేటీ అయినా చిరంజీవి.. అనంతరం మీడియాలో మాట్లాడుతూ.. పండగ పూట సీఎం జగన్తో ఆనందకర భేటీ జరిగిందని తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి బాధలను సీఎంకు వివరించానని చెప్పారు. సినిమా టికెట్ ధరల విషయంపై కొన్ని రోజులుగా మీమాంసం ఉంది. అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందోననే అసంతృప్తి ఒకవైపు.. ఇండస్ట్రీకి మేలు చేద్దామనేదే తమ ఉద్దేశం అని చెప్తున్న ప్రభుత్వం మరో వైపు. కొలిక్కిరాని ఈ సమస్య జఠిలమవుతున్న నేపథ్యంలో సీఎంగారు ప్రత్యేకంగా నన్ను రమ్మని ఆహ్వానించారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేముందు ఒక కోణంలో వినడం కాదు.. రెండో కోణంలోనూ వినాలని ఆయన అన్నారు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం, భరోసా ఎంతో బాధ్యతగా అనిపించింది.
ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ల సాధక బాధలు సీఎంకు వివరించాను వివరించా. నేను చెప్పిన అన్ని విషయాలను సీఎం సానుకూలంగా ఆలకించారు. సినీ ఇండస్ట్రీ విషయంలో సీఎం జగన్ స్పందన సంతృప్తినిచ్చింది. పైకి కన్పించినంత గ్లామర్ గా సినీ ఫీల్డ్ ఉండదు. రెక్కాడితే కాని డొక్కాడని పేదలు ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు. ధియేటర్ల యజమానులకూ అనేక బాధలు ఉన్నాయి. హాళ్లని మూసేస్తేనే బెటర్ అనే భావనకు కొందరు ధియేటర్ యజమానులు ఉన్నారు. ఈ సమస్యలన్నీ సీఎంకు వివరించాను. అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారు. టిక్కెట్ ధరలపై జారీ చేసిన జీవోను సీఎం పునః పరిశీలిస్తామన్నారు. ఐదో షో వేసుకునే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామన్నారు.
ఈ సమావేశం వివరాలను సినీ ఇండస్ట్రీలోని చిన్నా పెద్దలకు కూడా తెలియజేస్తాను. ఆ తర్వాత మరోసారి సీఎం జగన్ తో భేటీ అవుతా. వచ్చే సమావేశానికి అందర్నీ పిలిస్తే అందరం వస్తాం.. నన్నొక్కడినే పిలిస్తే నేనొక్కడినే వస్తాను. ఇండస్ట్రీ పెద్దగా కాదు ఒక బిడ్డగా చెబుతున్నా.. ఎవరూ ఆందోళన చెందొద్దు. అందరూ సంయమనంతో ఉండాలి. తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరుతున్నా. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు.” అన్నారు.













