వీరయ్య కోసం చిరు మెగా లీక్స్
చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాతో ఎలాగైనా ఫ్యాన్స్‌ను అలరించాలని చూస్తున్నాడు చిరు.బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన రీసెంట్ ఇంటర్వ్యూల్లో సినిమా కోసం చేసిన లీకుల గురించి ప్రశ్నించారు.
దీంతో అసలు చిరు లీక్స్ వెనుకున్న అసలు స్టోరీని రివీల్ చేశారు. ఇదంతా కేవలం వ్యూహం మాత్రమేనని మెగాస్టార్ చెప్పడం విస్మయం కలిగించింది. గాడ్ ఫాదర్, ఆచార్య లాంటి తన సినిమాల గురించి చాలా విషయాలు లీక్ చేశాడు. అవన్నీ కూడా ఆ వ్యూహంలో భాగమేనని, చెప్పీ చెప్పనట్లు గిల్లే వ్యూహాన్ని అనుసరించినట్లు చిరూ చెప్పుకొచ్చాడు.
అలాగే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ లో కూడా దాచేద్దాం దాచేద్దాం అంటూ మెగాస్టార్ కావాల్సినంత ఫన్ని క్రియేట్ చేశారు. దాచేద్దాం అంటూనే చాలా లీకులిచ్చేశారు. ఇదంతా ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచడానికి చేశామని, సినిమాకు సంబంధించిన చాలా క్యారెక్టర్లని ఎక్కడా రివీల్ కాకుండా చాలా జాగ్రత్త పడింది టీమ్.
కనీసం ట్రైలర్లో సైతం కొంత మంది క్యారెక్టర్లను ఎక్కువగా చూపించకుండా దాచేశారు. ఇదంతా టీమ్ వ్యూహమని తెలుస్తోంది. ప్రేక్షకులకు డైరెక్ట్ గా థియేటర్లలో చూపించడానికే ఈ వ్యూహాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
శృతి హాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కేథరిన్, ఊర్వశీ రౌతేలా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. ఈ సినిమా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుందని టీమ్ అంతా చెప్పుకొస్తుంది. మరి వాల్తేరు వీరయ్య కోసం మెగాస్టార్ చేసిన వ్యూహాలన్నీ పనికొస్తాయా లేదా అన్నది చూడాలి.













