గురూజీ డైరెక్షన్ లో మెగాస్టార్?
చిరంజీవి కెరీర్లో ఖైదీ అనే సినిమా ఓ మైలు రాయి అని అందరికీ తెలిసిందే. చిరంజీవికి ఎంతో ఇష్టమైన సినిమా కూడా అదే. ఖైదీ లాంటి యాక్షన్ ఫిల్మ్స్ చేయాలని చిరూకు ఎప్పట్నుంచో మనసులో ఉంది. అంతేకాదు తన చిత్రాల్లో సీక్వెల్ చేయాల్సి వస్తే మీ ఫస్ట్ ఛాయిస్ ఏంటంటే చిరూ నుంచి వచ్చే ఆన్సర్ ఖైదీ. అలాంటి సినిమా సీక్వెల్ ను ఇప్పుడు త్రివిక్రమ్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అ సినిమా సీక్వెల్ కు స్టోరీ రెడీ చేయమని స్వయంగా మెగాస్టారే త్రివిక్రమ్ ను అడిగారని మెగా వర్గాల సమాచారం. అంతేకాదు స్టోరీ ఇలా ఉంటే బాగుంటుందని చిరూ, గురూజీకి ఓ ఐడియా కూడా ఇచ్చారట. ఈ జెనరేషన్ కు తగ్గట్లు ఆ సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుందనే దాని గురించి చిరూ- త్రివిక్రమ్ చాలా సేపు డిస్కస్ చేసినట్లు కూడా తెలుస్తోంది.
ఈ స్టోరీ రెడీ చేయడానికి చిరూ ఆయనకు చాలా టైమ్ కూడా ఇచ్చాడని, ఎలాగూ చిరంజీవి ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు చేయాల్సి ఉంది. దానికి తోడు గురూజీ, చిరూ కాంబోలో సినిమా, ప్లస్ ఖైదీ సీక్వెల్ కాబట్టి ఏదైనా ల్యాండ్ మార్క్ నెంబర్ అయ్యే సినిమానే చేస్తారు. అంటే త్రివిక్రమ్ తో మెగాస్టార్ చేయబోయే సినిమా మెగా160 అయ్యే అవకాశాలెక్కువున్నాయి. ఈ సినిమా చిరూ కూతురు సుశ్మిత నిర్మించనుందని సమాచారం.













